Saturday, November 15, 2025
HomeTop StoriesTelangana Congress రోజుకో లొల్లి..వర్గ విబేధాలతో తెలంగాణ కాంగ్రెస్, తీరు మారదా ?

Telangana Congress రోజుకో లొల్లి..వర్గ విబేధాలతో తెలంగాణ కాంగ్రెస్, తీరు మారదా ?

Telangana Congress Issues: తెలంగాణలో అధికారం ఉందన్న మాటే గానీ మంత్రులు, నేతల్లో ఎవరిదారి వారిదే. మాట వినని మంత్రులు, లెక్కచేయని నేతల మధ్య రేవంత్ రెడ్డి తల పట్టుకుంటున్నారు. ఓ గొడవ ముగిసిందనుకుంటే..మరో లొల్లి జరుగుతోంది. కొందరైతే సీఎం రేవంత్ రెడ్డితో ఘర్షణ పెట్టుకుంటే ఇంకొందరు రాహుల్ గాంధీతో పోల్చుకుంటున్నారు. పూర్తి వివరాలు మీ కోసం..

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ గురించి ఎప్పటి నుంచో ఓ విషయం ప్రచారంలో ఉంది. పార్టీలో ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ. అందులో వాక్ స్వాతంత్ర్యం మరీ అధికం. దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న పార్టీ కావడం ఓ కారణం కావచ్చు. అందుకే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడుతుంటారు. క్రమశిక్షణ అనేది మచ్చుకైనా కన్పించదు ఈ పార్టీలో. రాజు బలవంతుడైతే కాస్త క్రమశిక్షణ ఉంటుంది. అందుకే వైఎస్ హయాంలో పరిస్థితి అదుపులో ఉండేది. తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తరువాత అధికారంలో రావడంతో ఆ పార్టీలో అందరూ ఎవరివారు సుప్రీంలే. అధికారంలో వచ్చి రెండేళ్లవుతోంది. ఇప్పుడు రోజుకో రచ్చ రేగుతోంది. కొత్తగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాల్సిన అవసరం లేదు. సొంత పార్టీ నేతల మధ్య ఘర్షణలు చాలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేంందుకు.

పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్షణ్
వివేక్ వర్సెస్ శ్రీధర్ బాబు

ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ మరో మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ గురించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. మనకైతే టైమ్ విలువ, జీవితం విలువ తెలుసని..ఆ దున్నపోతుకేం తెలుసంటూ పొన్నం వ్యాఖ్యానిస్తుంటే వివేక్ విని ఊరుకున్నారు. కేవలం తననే కాకుండా తన జాతిని సైతం అవమానించారంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ క్యాస్ట్ కార్డ్ ప్రయోగించేశారు. 24 గంటల్లో క్షమాపణలు చెప్పాలని హెచ్చరించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయానికొస్తే మంత్రులు పొన్నం ప్రభాకర్ వర్సెస్ శ్రీధర్ బాబు వర్సెస్ వివేక్ వెంకటస్వామికి పడటం లేదు. లక్ష్మణ్ కుమార్ మంత్రి శ్రీధర్ బాబుకు సన్నిహితుడైతే పొన్నంకు వివేక్ స్నేహితుడిగా ఉన్నారు. మరోవైపు కొండా సురేఖ వర్సెస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మద్య వైరం రాజుకుంది ప్రతిష్టాత్మకమైన సమ్మక్క-సారక్క జాతర ఏర్పాట్లు మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలో ఆగ్రహాం తెప్పించింది. పనులు కూడా తన సన్నిహితుడికి ఇప్పించుకున్నారంటూ కొండా సురేఖ…పొంగులేటికి వ్యతిరేకంగా ఏఐసీసీ పెద్దలకు ఫిర్యాదు చేసింది.

ఇక మంత్రి పదవి విషయంలో తీవ్ర అసంతృప్తికి గురైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే సై అంటున్నారు. ప్రతి వేదికపై నుంచి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది చాలదన్నట్టు నాంపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మరో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ అయితే మరో అడుగు ముందుకేసి ఏకంగా రాహుల్ గాంధీతో పోల్చుకుంటున్నారు. వయనాడ్‌లో పోటీ చేసిన రాహుల్ గాంధీ ఆ ప్రాంతంలో పుట్టారా అంటూ వ్యాఖ్యానించారు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీనే కాదు..ప్రభుత్వం కూడా అంతర్గత గొడవలతో సతమతమవుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad