Wednesday, January 8, 2025
HomeతెలంగాణTG Government: కేటీఆర్‌కు ఉచ్చు బిగిస్తున్న ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్

TG Government: కేటీఆర్‌కు ఉచ్చు బిగిస్తున్న ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్

ఫార్ములా ఈ-రేసు(Formula E-Race) వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)​ క్వాష్ పిటిషన్‌​ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టు(Supreme Court)లో కేవియట్‌ పిటిషన్‌(Caveat Petition) దాఖలు చేసింది. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేస్తే తమ వాదనలూ వినాలని ప్రభుత్వం కోరింది. దీంతో కేటీఆర్ ముందస్తు బెయిల్ లేదా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే.. ప్రభుత్వం తరఫున వాదనలు విన్న తర్వాతే తదుపరి ఉత్తర్వులు జారీ చేయనుంది.

- Advertisement -

ఇదిలా ఉంటే ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘నా మాటలు రాసి పెట్టుకోండి. ఈ ఎదురుదెబ్బల నుంచి బలంగా పుంజుకుంటాం. ఈ అబద్ధాలు నన్ను దెబ్బతీయలేవు. ఆ ఆరోపణలు నన్ను తగ్గించలేవు. కుట్రలతో నా నోరు మూయించలేరు. నేటి అడ్డంకులే రేపటి విజయానికి దారి తీస్తాయి. నేను న్యాయవ్యవస్థను గౌరవిస్తాను. న్యాయం గెలుస్తుందనేది నా అచెంచెల విశ్వాసం. సత్యం కోసం నా పోరాటం కొనసాగుతుంది. నా పోరాటానికి ఈ ప్రపంచమే సాక్షిగా నిలుస్తుంది’’ అని రాసుకొచ్చారు. మొత్తానికి కేటీఆర్ అరెస్ట్అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News