Temples development: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల అభివృద్ధే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆలయాలను ఆధ్యాత్మిక హంగులతో తీర్చిదిద్దే ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. దక్షిణ తెలంగాణ నుంచి ఉత్తర తెలంగాణ వరకు ఉన్న ప్రధాన టెంపుల్స్ అభివృద్ధి కై ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. అలంపూర్ నుంచి బాసర వరకు భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని తగిన ప్రణాళికలు రూపొందించింది. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తావులేకుండా ఉండేందుకు రూ.2,200 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో రాష్ట్ర వ్యప్తంగా ఉన్న 10 ప్రముఖ ఆలయాలను అభివృద్ధి చేయనున్నారు. అదేవిధంగా.. రూ.779.74 కోట్ల సీజీఎఫ్ నిధులతో 1,979 దేవాలయాల్లో సౌకర్యాలు కల్పించనున్నారు.
టూరిస్ట్‌ల సౌకర్యాలే లక్ష్యంగా పనులు: రాష్ట్రానికి వచ్చే టూరిస్ట్‌లతో పాటుగా భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో.. వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఎండోమెంట్ ప్రత్యేక దృష్టిపెట్టింది. రహదారుల విస్తరణ, అన్నదాన సత్రాలు, వసతిగృహాలు, క్యూలైన్ కాంప్లెక్స్‌లు, మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం వంటి పలు పనులు చేపట్టనున్నట్లు ఎండోమెంట్ అధికారులు తెలిపారు. రద్దీ సమయాల్లో ఇబ్బందులు తొలగించేందుకు పలు దేవాలయాల్లో మండపాలను సైతం ఏర్పాటు చేయనున్నారు.
4 దశల్లో అభివృద్ధి పనులు: పలు దేవాలయాల్లో అన్నదాన సత్రాల ద్వారా భక్తులకు ఆహార సౌకర్యం కల్పించనున్నారు. ఈ అభివృద్ధి పనులను 4 దశల్లో చేపట్టనున్నారు. మొదటి దశలో రహదారుల విస్తరణ కాగా, రెండో దశలో వసతిగృహాలు ఎర్పాటు చేయనున్నారు. మూడో దశలో అన్నదాన సత్రాలు మరియు నాల్గో దశలో క్యూలైన్ కాంప్లెక్స్‌ల నిర్మాణం పూర్తి చేయనున్నారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/brs-mlas-are-engaged-to-cm-revanth-reddy/
రాష్ట్ర వ్యప్తంగా ఉన్న 10 ప్రముఖ ఆలయాలు:
1. వేములవాడ రాజరాజేశ్వరస్వామి
2. భద్రాచలం సీతారామచంద్రస్వామి
3. బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానం
4. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం
5. కొడంగల్ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం
6. అలంపూర్‌లోని జోగుళాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయం
7. కీసరగుట్టలోని రామలింగేశ్వర స్వామి ఆలయం
8. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
9. చెర్వుగట్టు పార్వతీజడల రామలింగేశ్వరస్వామి
10. మేడారం సమ్మక్క– సారలమ్మ ఆలయాన్ని ఎంపిక చేశారు.


