ఆర్టీసీ(TGSRTC) ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2.5 శాతం డీఏను రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ప్రకటించారు. డీఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై 3.6 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. మహిళా దినోత్సవం నుంచి ఈ డీఏ అమలులోకి వస్తుందని పొన్నం తెలిపారు. మహిళా సాధికారత దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు.
మరోవైపు కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తొలి దశలో మండల మహిళా సమైక్య సంఘాల నుంచి 150 బస్సులను.. రెండో దశలో మరో 450 బస్సులను ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన ఇవ్వనున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా శక్తి బస్సులను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించనున్నారు.