Sunday, November 16, 2025
HomeతెలంగాణWomen Groups: మహిళా సంఘాలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Women Groups: మహిళా సంఘాలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

మహిళా సంఘాల(Women Groups)కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాలకు ఆర్టీసీ(RTC Buses)అద్దె బస్సులు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. తొలి విడతలో 150 మండల సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించింది. ఆ తర్వాత మిగిలిన మండల సమాఖ్యలకు 450 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించనుంది. ప్రతి నెలా ఒక్కో బస్సుకు రూ. 77,220 చొప్పున ఆర్టీసీ అద్దె చెల్లించనుంది.

- Advertisement -

బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇవ్వనుంది. త్వరలోనే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా 50 బస్సులను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad