Friday, November 22, 2024
HomeతెలంగాణTS Group-4 posts : తెలంగాణ‌లో నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. 9,168 గ్రూప్‌-4 పోస్టుల భ‌ర్తీకి అనుమ‌తి

TS Group-4 posts : తెలంగాణ‌లో నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. 9,168 గ్రూప్‌-4 పోస్టుల భ‌ర్తీకి అనుమ‌తి

TS Group-4 posts : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు ప్ర‌భుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్‌-4 పోస్టుల భ‌ర్తీకి అనుమ‌తి ఇచ్చింది. 9,168 పోస్టుల భ‌ర్తీకి అనుమ‌తిస్తూ ఆర్థిక శాఖ ఉత్వ‌ర్తులు జారీ చేసిన‌ట్లు మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(టీఎస్‌పీఎస్‌సీ) ద్వారా గ్రూప్‌-4 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేర‌కు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. ఆర్థిక శాఖ అనుమ‌తి ఇచ్చిన నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే గ్రూప్‌-4 పోస్ట్‌ల‌కు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేష‌న్లు విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

- Advertisement -

గ్రూప్‌-4 ఉద్యోగాల్లో ప్ర‌ధానంగా నాలుగు కేట‌గిరీల‌కు సంబంధిన పోస్టులున్నాయి. 429 జూనియ‌ర్ అకౌంటెంట్ పోస్టులు, 6,859 జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టులు, 18 జూనియ‌ర్ ఆడిట‌ర్ పోస్టులు, 1,862 వార్డు ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ఆర్థిక శాఖ అనుమ‌తి ఇచ్చింది.

  • జూనియ‌ర్ అకౌంటెంట్ పోస్టులు (429) : ఆర్థిక శాఖ‌లో 191, పుర‌పాల‌శాఖ‌లో 238 పోస్టులు ఉన్నాయి
  • జూనియర్ అసిస్టెంట్ పోస్టులు(6,859).. వ్య‌వ‌సాయ‌శాఖ‌లో 44, బీసీ సంక్షేమ‌శాఖ‌లో 307, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌లో 72, అట‌వీశాఖ‌లో 23, ఆర్థిక‌శాక‌లో 46, వైద్య‌-ఆరోగ్య‌శాఖ‌లో 338, ఉన్న‌త విద్యాశాఖ‌లో 742 పోస్టులు ఉన్నాయి. హోంశాఖ‌లో 133, నీటిపారుద‌ల శాఖ‌లో 51, కార్మిక‌శాఖ‌లో 128, మైనార్టీ సంక్షేమ‌శాఖ‌లో 191, పుర‌పాల‌క శాఖ‌లో 601, పంచాయ‌తీరాజ్ శాఖ‌లో 1245, రెవ్యెన్యూ శాఖ‌లో 2,077, ఎస్సీ అభివృద్ధి శాఖ‌లో 474, సెకండ‌రీ విద్యాశాఖ‌లో 97, ర‌వాణాశాఖ‌లో 20, గిరిజ‌న సంక్షేమ‌శాఖ‌లో 221, మ‌హిళా శిశు సంక్షేమ‌శాఖ‌లో 18, యువ‌జ‌న స‌ర్వీసుల శాఖ‌లో 13 పోస్టులు ఉన్నాయి.
  • జూనియ‌ర్ ఆడిట‌ర్ పోస్టులు 18
  • వార్డు ఆఫీస‌ర్ పోస్టులు 1862

మొత్తం 9,168 గ్రూప్‌-4 పోస్టులు ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News