Sunday, April 13, 2025
HomeతెలంగాణTelangana Govt: యాసంగి మొక్కజొన్న కొనుగోలుకు సర్కారు నిర్ణయం

Telangana Govt: యాసంగి మొక్కజొన్న కొనుగోలుకు సర్కారు నిర్ణయం

తక్షణం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. యాసంగిలో దాదాపు 6.50 లక్షల ఎకరాలలో మొక్కజొన్న సాగు కాగా 17.37 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో ప్రధానంగా మొక్కజొన్న సాగు ఎక్కువగా ఉంది. మొక్కజొన్న క్వింటాలుకు ప్రభుత్వ మద్దతుధర రూ.1962 ఇస్తోంది కేసీఆర్ సర్కారు. దీంతో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News