Telangana Pending Bills Release : తెలంగాణలో ప్రభుత్య ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు రిలీఫ్ వచ్చింది. పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని ప్రభుత్యం నిర్ణయించింది. అక్టోబర్ నెలకు సంబంధించి మొత్తం రూ.1,032 కోట్లు విడుదల చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముందు ఉద్యోగుల ఆందోళనలను శాంతపరచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో నెలలుగా హామీలు ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడంతో ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు ఈ బకాయిలు విడుదలతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
హైదరాబాద్ ప్రజా భవన్‌లో ఆర్థిక శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం మల్లా భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ బిల్లులను దశలవారీగా విడుదల చేస్తూ, అక్టోబర్ నెలకు సంబంధించిన బకాయిలలో రూ.712 కోట్లు విడుదల చేసినట్లు ఆదేశించారు. అదనంగా కొన్ని మరికొన్ని పెండింగ్ బిల్లులు కూడా విడుదల అయ్యాయి. రూ.10 లక్షల లోపు విలువైన బిల్లుల్ని ప్రత్యేకంగా విడుదల చేయాలని ప్రభుత్యం నిర్ణయించింది. పంచాయతీరాజ్, ఆర్ & B శాఖలకు చెందిన 46,956 బిల్లులలో రూ.320 కోట్లు విడుదల చేశారు. రోడ్లు, భవనాల శాఖలోని 3,610 బిల్లులలో రూ.95 కోట్లు విడుదలయ్యాయి. పంచాయతీరాజ్, గ్రామీణ స్థానిక సంస్థలకు చెందిన 43,364 బిల్లుల మొత్తం రూ.225 కోట్లు ప్రభుత్యం విడుదల చేసింది.
ఈ నిర్ణయం తెలంగాణ ప్రభుత్యం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి తీసుకుంది. గతంలో ఉద్యోగులు, యూనియన్లు పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముందు ఈ చర్య తీసుకోవడం ప్రభుత్యకు రాజకీయ లాభం కలిగించేలా కనిపిస్తోందని విశ్లేశకులు అంచనా వేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క “ఉద్యోగుల సమస్యలు మా ప్రాధాన్యత. దశలవారీగా మిగిలిన బకాయిలు క్లియర్ చేస్తాము” అని హామీ ఇచ్చారు.


