Job calendar: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పడానికి సిద్ధమవుతోంది. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. ఉద్యోగ భర్తీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇటీవల వెల్లడించిన గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాల్లో కొందరు అభ్యర్థుల ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు ఎంపిక కావడం.. కొందరు వారికి నచ్చిన పోస్టులు రాకపోవడంతో జాయిన్ కాలేదు. దీంతో చాలా వరకు బ్యాక్‌లాగ్ పోస్టులు మిగిలే అవకాశం ఉండనుంది. కొత్తగా గుర్తించిన వాటితో కలిపి గ్రూప్ 1,2,3, పోలీస్, టీచర్ ఇలా మొత్తం 20 వేల పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం.
20వేల పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి: రాష్ట్ర సర్కార్ ఉద్యోగాల భర్తీలో వేగం పెంచి నోటిఫికేషన్లు జారీ చేయడంపై ఫోకస్ పెట్టింది. గ్రూప్-3 తుది నియామకాలు మినహా గ్రూప్1తో పాటు గ్రూప్–2 నియమకాలు పూర్తవడంతో టీజీపీఎస్సీ, గురుకుల, పోలీస్, ఎలక్ట్రికల్ నియామక బోర్డులు కొత్త ఉద్యోగాల భర్తీకి వీలుగా సంబంధిత విభాగాల నుంచి ప్రతిపాదనలు తీసుకునేందుకు అవసరమైన అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభించాయి. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడం, పెండింగ్ నియామకాలు దాదాపు పూర్తవడంతో సంబంధిత విభాగాలు వర్గీకరణ రోస్టర్ ప్రకారం ఉద్యోగ ఖాళీలు గుర్తిస్తున్నాయి. ప్రస్తుతం స్థానిక ఎన్నికల హడావుడి కొనసాగుతుండగా, కోడ్ ముగిసిన వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి వరుస నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే 20వేల పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది.
ఇంజినీరింగ్ విభాగాల్లోనూ 3 వేలు: జాబ్ క్యాలెండర్ లో పేర్కొన్న కేటగిరీల వారీగా గ్రూప్స్, టీచర్స్, పోలీస్, విద్యుత్, గురుకుల, వైద్య నియామకాలు చేపట్టేందుకు పరిపాలన ప్రక్రియ చేపట్టింది. ఆర్టీసీ, వైద్య విభాగాల పరిధిలో దాదాపు 10వేల వరకు ఖాళీలు ఉంటాయని అంచనా. ఇప్పటికే ఆర్టీసీలో 1.743 డ్రైవర్లు, శ్రామిక్ పోస్టులకు, వైద్య విభాగంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, అసిస్టెంట్ ప్రొఫె సర్లు, ఇతర పోస్టులు కలిపి 2,300 ఖాళీలకి నోటిఫికేషన్లు వచ్చాయి. ప్రభుత్వ విభాగాలు, విద్యుత్ సంస్థల్లోని ఇంజినీరింగ్ విభాగాల్లోనూ 3 వేల వరకు ఖాళీలున్నట్లు సమాచారం. అధికంగా పోలీస్ విభాగంలో 17000 ఖాళీలు ఉన్నట్లు సమాచారం. ఎస్సై, కానిస్టేబుల్ స్థాయిలో 17000 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో కానిస్టేబుల్ ఉద్యోగాలే 15000 వరకు, ఎస్సై పోస్టులు 1000 వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం.
Also Read:https://teluguprabha.net/telangana-news/tg-high-court-sensational-verdict-in-rape-case/
4వేలకు పైగా బ్యాక్ లాగ్ పోస్టులు: కొందరు ఒకటికన్నా ఎక్కువ పోస్టులకు ఎంపిక కావడం, వచ్చిన పోస్టు నచ్చక కొందరు చేరకపోవడంతో పోస్టులు బ్యాక్గ్గా మారాయి. వీటితో పాటు కొత్తగా గుర్తించిన పోస్టులకు కలిపి ప్రభుత్వ విభాగాలు ప్రతిపాదనలు రూపొందిస్తున్నాయి. ఇటీవల నియామకాలు పూర్తైన వాటిలో బ్యాక్లాగ్ ఖాళీలు దాదాపు 4 వేలకు పైగా ఉన్నట్లు సమాచారం. ఒక్క గురుకుల నియామక బోర్డు పరిధిలోనే దాదాపు 2వేల వరకు ఉంటాయని అంచనా. గ్రూప్-4లోనూ కొన్ని ఖాళీలున్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2లలో కలిపి 80 పోస్టులు బ్యాక్లాగ్ కానున్నాయి. గ్రూప్ 3 నియామకాలకు టీజీపీఎస్సీ వ్యూహాత్మకంగా వెళ్తుంది. గ్రూప్ 1.2 నియామకాలన్నీ పూర్తైన తర్వాతే గ్రూప్ 3 పరిశీలన చేయనుంది. గ్రూప్2, గ్రూప్ 3 నోటిఫికేషన్లలో రెండు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు దాదాపు 300 మంది వరకు ఉన్నట్లు సమాచారం.


