Saturday, January 11, 2025
HomeతెలంగాణKTR: అరాచకాలకు చిరునామాగా తెలంగాణ మారింది: కేటీఆర్

KTR: అరాచకాలకు చిరునామాగా తెలంగాణ మారింది: కేటీఆర్

యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు. పదేళ్లపాటు ప్రశాంతంగా కొనసాగిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు మళ్లీ అరాచక పాలనకు చిరునామాగా మారిందని మండిపడ్డారు.

- Advertisement -

“ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపై దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది. ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గుండారాజ్యం చలాయిస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, కాంగ్రెస్ పార్టీ గుండాలను పంపి దాడులు చేయించడం అత్యంత హేయమైన చర్య. ఎన్నుకున్న ప్రజలతో పాటు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై, నాయకులపై, పార్టీ కార్యాలయాలపైన దాడులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.

పదేళ్ల పాటు ప్రశాంతంగా కొనసాగిన తెలంగాణ రాష్ట్రం, ఈరోజు అరాచకాలకు చిరునామాగా మారిందని, దాడులు, గుండాగిరి తమ మార్కు పాలన అని కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించుకుంటోంది. మా పార్టీ కార్యకర్తల, నాయకుల జోలికి, కార్యాలయాల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తాం. వెంటనే బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలతో పాటు, వారి వెనుక ఉన్న జిల్లా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాను” అని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News