తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు రైలు సేవలపై తీవ్ర ప్రభావం చూపాయి. దక్షిణ మధ్య రైల్వే (SCR) పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించింది. బుధవారం కరీంనగర్-కాచిగూడ, కాచిగూడ-నిజామాబాద్, కాచిగూడ-మెదక్, మెదక్-కాచిగూడ, బోధన్-కాచిగూడ, ఆదిలాబాద్-తిరుపతి రైళ్లు రద్దయ్యాయి. గురువారం నిజామాబాద్-కాచిగూడ సర్వీసు కూడా రద్దు చేశారు. మహబూబ్‌నగర్-కాచిగూడ, షాద్‌నగర్-కాచిగూడ రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు.
ALSO READ: Reservoirs flood alert : నిండిన గండిపేట.. మూసీకి పోటెత్తిన వరద.. పరివాహక ప్రాంతాలకు తీవ్ర హెచ్చరిక!
కామారెడ్డి-బికనూర్-తలమడ్ల, అకన్పేట్-మెదక్ రైల్వే ట్రాక్‌లపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రభావంతో రైళ్ల రద్దు, దారి మళ్లింపు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు.
హెల్ప్‌లైన్ నంబర్లు:
కాచిగూడ: 9063318082
నిజామాబాద్: 970329671
కామారెడ్డి: 9281035664
సికింద్రాబాద్: 040-27786170
ప్రయాణికులు తమ రైలు సమాచారం కోసం ఈ నంబర్లకు సంప్రదించవచ్చు. భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాక్‌లపై నీరు చేరడంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను ముందుగా తనిఖీ చేసుకోవాలని సూచించారు.


