బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy) కి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ని కొట్టేయాలంటూ ఆయన వేసిన క్వాష్ పిటిషన్ ని న్యాయస్థానం కొట్టేసింది. లగచర్ల ఘటనలో రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ నవంబర్ 19 న పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. నేడు దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం… పిటిషన్ కొట్టేస్తూ తీర్పు వెలువరించింది.
- Advertisement -
పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy) బెయిల్ ను పరిశీలించి జిల్లా కోర్టు తీర్పు ప్రకటించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి ఏ1 గా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టైన ఆయన ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.