తెలంగాణ హైకోర్టు(TG High Court)కు నలుగురు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు వీరిని నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu)ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాది జూన్ 1 వరకు జస్టిస్ తిరుమల దేవి.. జస్టిస్ రేణుక, జస్టిస్ నర్సింగ్ రావు నందికొండ, జస్టిస్ మధుసూదన్ రావు రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా రెండేళ్ల పాటు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ సుజోయ్ పాల్ ఇటీవల నియమితులైన సంగతి తెలిసిందే.