18 దేశాల నుంచి కీబోర్డ్ సంగీత కళాకారులు పాల్గొన్న కార్యక్రమంలో.. ఓ మహిళ (లలితకుమారి) తన పిల్లలు మేడిది లీషా ప్రజ్ఞ (8) మరియు మేడిది అభిజ్ఞ (5) తో కలిసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. చిన్న వయసులో ఈ రికార్డు నెలకొల్పినందుకు తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, వ్యవసాయం, సహకార మార్కెటింగ్, చేనేత వస్త్రాలు శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిన్నారులను మరియు తల్లితండ్రులను అభినందించారు.
డిసెంబర్ 1, 2024న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ను సృష్టించడానికి హాలెల్ మ్యూజిక్ స్కూల్ విద్యార్థులతో కలిసి గంట వ్యవధిలో మ్యూజిక్ చేసి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వీడియోలు అప్‌లోడ్ చేయగా, లండన్లోని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధినేత రిచర్డ్ స్టన్నింగ్ సంగీత కళాకారులను విజేతలుగా ప్రకటించి, డిసెంబర్ 9, 2024న లండన్ నుండి జూమ్ మీటింగ్ ద్వారా వారిని అభినందించారు.
ఏప్రిల్ 14, 2025 సోమవారం హైదరాబాద్లోని మణికొండలో జరిగిన వేడుకలలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి ఆనంద్ రాజేంద్రన్, హాలెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు అగస్టీన్ దండింగి సర్టిఫికెట్లు, పతకాలు అందజేశారు. ఈ విజయంపై చిన్నారులు మాట్లాడుతూ తమ తల్లి వారికి నేర్పించడం వల్లే ఈ విజయం సాధించామని అన్నారు.