Telanagana : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు రెండేళ్ల కాలానికి మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు జారీ చేయనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా రూ.3,500 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. దరఖాస్తు రుసుము గతంలో రూ.2 లక్షలుగా ఉండగా, ఈసారి రూ.3 లక్షలకు పెంచారు, ఇది నాన్-రీఫండబుల్. ఈ రుసుము పెంపు ద్వారా రూ.1,400 కోట్లు సమకూరే అవకాశం ఉంది.
ALSO READ: Mokshagna : మోక్షజ్ఞ లవ్ స్టోరీ చూడాలనుకుంటున్నా – నారా రోహిత్
రిజర్వేషన్ విధానంలో స్పష్టత తెచ్చారు. మొత్తం దుకాణాల్లో 15% గౌడ్ కమ్యూనిటీకి, 10% షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ), 5% షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీ) కేటాయించారు. ఈ రిజర్వేషన్లు నిర్దిష్ట ప్రాంతాల దుకాణాలకు మాత్రమే వర్తిస్తాయి. 786 దుకాణాలు ఈ కమ్యూనిటీలకు కేటాయించబడతాయి, ఇందులో హైదరాబాద్‌లో 615 దుకాణాలు ఉన్నాయి. లైసెన్స్ ఫీజు జనాభా, ప్రాంతం ఆధారంగా 6 స్లాబ్‌లుగా విభజించారు, ఏడాదికి రూ.50 లక్షల నుంచి రూ.1.1 కోట్ల వరకు ఉంటుంది. గతంతో పోలిస్తే ఫీజు 15% పెరిగింది.
వాక్-ఇన్ స్టోర్స్ కోసం ఏడాదికి అదనంగా రూ.5 లక్షలు చెల్లించాలి. దుకాణాల్లో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి, ఎక్సైజ్ శాఖ కంట్రోల్ రూమ్‌కు లింక్ చేయాలి. వ్యాపార సమయాలు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటాయి. ట్రేడర్లకు సాధారణ ఐఎంఎఫ్‌ఎల్‌పై 27%, ప్రీమియం ఐఎంఎఫ్‌ఎల్, బీర్‌పై 20% మార్జిన్ నిర్ణయించారు. ఆసక్తి ఉన్నవారు ఎక్సైజ్ శాఖ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా పారదర్శకత, ఆదాయ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.


