Medical Jobs: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ రెండు రోజుల్లో వెలువడనుంది.

తెలంగాణ ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ కానుంది.

ఒకే రోజు మూడు వేర్వేరు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వడానికి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సిద్ధమైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్, డెంటర్ అసిస్టెంట్ సర్జన్స్, స్పీచ్ ఫాథాలిజిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.

నేటి సాయంత్రం లేదా రేపు ఉదయంలోగా ఈ నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశం ఉంది.

దీంతోపాటు మరో 3212 నర్సింగ్ ఆఫీసర్లు, 732 ఫార్మసిస్ట్, 1284 ల్యాబ్ టెక్నీషియన్స్, 1950 మల్టీపర్పస్ ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ ప్రక్రియ చేపట్టారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో గడిచిన 8 నెలల్లో 17 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసినట్లు అధికారులు తెలిపారు.