Philippines| తెలంగాణకు చెందిన విద్యార్థిని ఫిలిప్పీన్స్ దేశంలో అనుమానాస్పదంగా మృతి చెందింది. సంగా రెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని ఇంద్రేషం గ్రామానికి చెందిన చింత స్నిగ్ధ అనే యువతి ఎంబీబీఎస్(MBBS) చదివేందుకు ఫిలిప్పీన్స్ వెళ్లారు. పెర్ఫెక్చువల్ హెల్ప్ యూనివర్సిటీ, మనీలాలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే పుట్టిన రోజు నాడే ఆమె మృతి చెందడం కుటుంబసభ్యుల్లో తీవ్ర విషాదం నిందిపింది
ఆమె పుట్టినరోజు సందర్భంగా తెల్లవారుజామున స్నేహితులు శుభాకాంక్షలు చెప్పేందుకు యువతి గదికి వెళ్లే సరికి అనుమానాస్పద రీతిలో మృతి చెంది ఉంది. పోలీసులకు సమాచారం అందించడంతో వారు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన కుమార్తె విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు ఆర్తనాధాలు మిన్నంటాయి. స్నిగ్ధ తండ్రి అమృత్ రావు విద్యుత్ శాఖలో డీఈవోగా పనిచేస్తున్నారు. కాగా యువతి మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఆ దేశ అధికారులతో స్థానిక అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.