Telangana Police on Social Media Fake News: సోషల్ మీడియాలో వచ్చే ఏ వార్త అయినా లేదా సమాచారమైనా నిజమా కాదా తెలుసుకోకుండా ఎవరికీ షేర్ చేయొద్దని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియా వచ్చే ఏ వార్తను లేదా సమాచారాన్ని అయినా క్షుణ్ణంగా పరిశీలించకుండా, నిజానిజాలు నిర్ధారించుకోకుండా గుడ్డిగా ఫార్వార్డ్ చేయవద్దని చెప్పారు. తప్పుడు సమాచారాన్ని తొందరపడి ప్రచారం చేయరాదని సూచించారు. వార్తల్లోని సత్యాసత్యాలను నిర్ధారించుకున్న తర్వాతనే వాటిని ఇతరులతో పంచుకోవాలని స్పష్టం చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/petition-in-high-court-on-new-liquor-policy-fee-2025/
‘సామాజిక మాధ్యమ వినియోగదారులు అసత్య వార్తల ప్రచారంలో భాగస్వాములు కావొద్దు. వాట్సాప్ గ్రూపులు, ఇతర సామాజిక మాధ్యమాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే చట్టపరమైన చిక్కుల్లో పడతారు. సెన్సేషనలిజం కోసం పాకులాడొద్దు.’ అని తెలంగాణ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.
సోషల్ మీడియాలో ఏదైనా న్యూస్ లేదా సమాచారాన్ని ఫార్వార్డ్ చేసే ముందు ఆలోచించండి. తొందరపడి తప్పుడు సమాచారం ప్రచారం చేయొద్దు. మీరు చూసే వార్తల్లో నిజానిజాలను నిర్ధారించుకున్న తర్వాతే షేర్ చేయండి. ఫేక్ వార్తల ప్రచారంలో మీరు భాగస్వాములు కాకుండా చూసుకోండి.#telanganapolice pic.twitter.com/zUcK10GQvD
— Telangana Police (@TelanganaCOPs) October 13, 2025
క్రెడిట్ కార్డు వినియోగదారులు జాగ్రత్త
అనంతరం సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేశారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. క్రెడిట్ కార్డు వినియోగదారులు నిత్యం అలర్ట్‌గా ఉండాలని.. కార్డు లిమిట్ పెంచుతామని మోసాలకు పాల్పడే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. ఫేక్ లింక్స్ పంపి మోసగించే అవకాశం ఉందని.. కస్టమర్ కేర్ ప్రతినిధులు ఎప్పుడూ ఓటీపీ అడగరని పేర్రొన్నారు. మీ క్రెడిట్ కార్డు సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరికలు చేశారు.


