Telangana Pre Marital Counseling Centers : తెలంగాణలో విడాకులు, కుటుంబ కలహాలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం కీలక చర్య తీసుకుంది. యువ దంపతులకు ముందుగానే మార్గదర్శకత్వం అందించేందుకు, ప్రీ-మ్యారిటల్ కౌన్సెలింగ్ సెంటర్లు (PMCC) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రాల్లో నిపుణులు పెళ్లి చేసుకోబోయే జంటలకు అవగాహన, వివాద పరిష్కారం, కుటుంబ బాధ్యతలపై శిక్షణ ఇస్తారు. మంత్రి సీతక్క ఈ ఫైల్‌పై సంతకం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 33 సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. మొదట్లో సఖీ, వన్ స్టాప్ సెంటర్‌లలో మొదలై, తర్వాత సొంత భవనాలు కేటాయిస్తారు.
ALSO READ: Mayukha : వరంగల్ అమ్మాయి అద్భుతం.. ఒక్క లింక్‌తో ఉద్యోగం మీ సొంతం!
ప్రతి సెంటర్‌లో లీగల్ కౌన్సెలర్, సైకాలజిస్ట్, సోషల్ వర్కర్, హెల్పర్ నియమితులవుతారు. సిబ్బందికి నెలకు రూ.30,000 వేతనం. సంచాలన, నిర్వహణకు ఏడాదికి రూ.5 కోట్లు ఖర్చవుతాయి.
కౌన్సెలింగ్ అంశాలు: పరస్పర అవగాహన, వివాద పరిష్కారం, భావోద్వేగ అనుకూలత, చట్టపరమైన హక్కులు, జెండర్ సెన్సిటివిటీ, కుటుంబ బాధ్యతలు. మంత్రి సీతక్క “కుటుంబ వ్యవస్థ బలోపేతం చేయడానికి ఈ సెంటర్లు అవసరం” అని చెప్పారు. ఫైల్ ఆర్థిక శాఖకు వెళ్లిన తర్వాత, వెంటనే అమలు ప్రారంభమవుతుంది.
తెలంగాణ మహిళా కమిషన్, సఖీ కేంద్రాలకు వివాహ సంబంధ ఫిర్యాదులు భారీగా పెరిగాయి. యువ జంటల మధ్య అవగాహన లోపం, తల్లిదండ్రుల జోక్యం, చిన్న కుటుంబాలు, తరాల మధ్య దూరం వంటివి కారణాలు. “ఈ సమస్యలకు పరిష్కారంగా PMCC అవసరం” అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మహిళా కార్యకర్తలు “ఇది మంచి చర్వ” అని స్వాగతించారు. ప్రభుత్వం “కుటుంబ బంధాలు బలోపేతం” లక్ష్యంగా ఈ చొరవ తీసుకుంది. సెంటర్లు మహిళల భద్రత, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పెంచుతాయని ఆశ. మరిన్ని వివరాలకు మహిళా శాఖను సంప్రదించండి.


