Friday, May 2, 2025
Homeతెలంగాణప్రభుత్వంతో చర్చలకు సిద్ధమైన తెలంగాణ ఆర్టీసీ..!

ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమైన తెలంగాణ ఆర్టీసీ..!

తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల నిరవధిక సమ్మె అంశం కీలక మలుపు తిరిగింది. మే 7వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని జేఏసీ నిర్ణయించిన నేపథ్యంలో, ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని ప్రకటించింది. మే డే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ, ఉద్యోగుల సమస్యలను పరిగణనలోకి తీసుకుని వారితో సంప్రదింపులకు సిద్ధమని స్పష్టం చేశారు.

- Advertisement -

సమ్మె వల్ల సంస్థకు నష్టం జరుగుతుందని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు తాత్కాలికంగా తీసుకోలేనని సీఎం వివరించారు. అయితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మెరుగవుతున్న కొద్దీ, అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. అదే సమయంలో, ఉద్యోగులు ఆందోళన మార్గాన్ని తప్పుకుని, చర్చల ద్వారా పరిష్కారాన్ని కోరుకోవాలని సీఎం సూచించారు.

ముఖ్యమంత్రి ప్రకటనపై ఆర్టీసీ జేఏసీ కూడా స్పందించింది. సీఎం మాటలను సానుకూలంగా తీసుకుంటున్నామని, చర్చలకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. గత కొన్నినెలలుగా 2021 పీఆర్సీ అమలు, పెండింగ్ బకాయిల చెల్లింపు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్లతో ఉద్యోగులు పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం – ఉద్యోగుల మధ్య చర్చలు జరగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సమ్మెను విరమించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News