తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని వైరా ఏసిపి రెహమాన్ ఆధ్వర్యంలో 2కే రన్‌ను మధిర సిఐ మురళి సిబ్బంది సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పాల్గొని జండా ఊపి 2కే రన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు మధిర, ఎర్రుపాలెం, బొనకల్, చింతకాని, ముదిగొండ మండలాల ప్రజలు, యువతీ యువకులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు,వివిధ వ్యాపార రంగాల వారు నియోజకవర్గ అందరూ పాల్గొని విజయవంతం చేశారు.
మధిర అదనపు జూనియర్ సివిల్ జడ్జి టి కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ….. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పోలీస్ శాఖ వారు నిర్వహించిన 2కే రన్ కార్యక్రమం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని ప్రజలందరూ రోజు వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యానికి కాపాడుకోవాలని సూచించారు. అనంతరం సిఐ మురళి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
Madhira: మధిర పోలీసు ఆధ్వర్యంలో తెలంగాణ రన్
ఈ కార్యక్రమం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని ప్రజలందరూ రోజు వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యానికి కాపాడుకోండి