MP Raghu Rama Krishna Raju : నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ షాకిచ్చింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు అందజేసింది. బంజారాహిల్స్‌లోని సిట్ కార్యాలయంలో ఈ నెల 29న జరిగే విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.
ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తులో భాగంగా ఎంపీ రఘురామకు సంబంధించిన పలు కీలక విషయాలను సిట్ సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్రాభారతి, నందకుమార్, సింహయాజిలతో రఘురామ టచ్‌లో ఉన్నట్లు. ఎమ్మెల్యేల కొనుగోలుకు రూ.100 కోట్లు సమకూరుస్తానని ఆయన చెప్పినట్లు సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు నోటీసులు ఇచ్చింది.
రామచంద్రాభారతి, నందకుమార్, సింహయాజిలను ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, భారతీయ దర్మజనసేన చీఫ్ తుషార్, కేరళ డాక్టర్ డా.జగ్గుస్వామి, న్యాయవాది శ్రీనివాస్ లకు సిట్ ఇప్పటికే నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.