MLAs disqualification petitions: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆచితూచి అడుగులేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణకు శాసనసభ స్పీకర్ కార్యాలయం ఇటీవల సుప్రీంకోర్టును గడువు కోరిన విషయం తెలిసిందే. గతంలో కోర్టు విధించిన మూడు నెలల గడువు అక్టోబర్ 31తో పూర్తికావడంతో.. మరో రెండు నెలల గడువు ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం కోరింది. ఇప్పటి వరకు నలుగురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి అయ్యింది. అయితే ఇదే అంశంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై.. విచారణ కోసం మరోసారి స్పీకర్ కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది.
రోజుకు ఇద్దరు చొప్పున క్రాస్ ఎగ్జామినేషన్: బీఆర్‌ఎస్ దాఖలు చేసిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సభాపతి విచారణ చేపట్టనున్నారు. ఈ మేరకు అందుకు సంబంధించి షెడ్యూల్‌ను ఇవాళ విడుదల చేశారు. ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లాం వెంకట్రావు, అరికెపూడి గాంధీ అనర్హత పిటిషన్లపై ఈనెల 6, 7, 12, 13 తేదీల్లో విచారణ చేపట్టనున్నట్టుగా స్పీకర్ కార్యాలయం వెళ్లడించింది. మొదట పిటిషనర్లు.. ఆ తర్వాత ప్రతివాదుల క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుందని పేర్కొంది. రోజుకు ఇద్దరు చొప్పున క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ఉండనుందని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ తాజాగా షెడ్యూల్ విడుదల చేశారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/promotions-in-telangana-medical-and-health-departments/
స్పీకర్ చర్యలు తీసుకోకున్నా చేతులు కట్టుకొని చూస్తుండాలా?: పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిన స్పీకర్ చర్యలు తీసుకోకపోతే మేం (కోర్టులు) చేతులు కట్టుకొని కూర్చోవాలా? అంటూ గతంలో సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు తమ ముందుకు వచ్చే దాకా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ ఎందుకు నోటీసులు జారీ చేయలేదని ప్రశ్నించింది. తొలి నోటీసు ఇచ్చేందుకు స్పీకర్‌కు 11 నెలలు ఎందుకు పట్టిందని నిలదీసింది. అయితే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాల్సింది .. శాసనసభ స్పీకర్ అని తేలిపింది. స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. గతంలో సుప్రీంకోర్టు విధించిన మూడు నెలల గడువు పూర్తికావడంతో ఇటీవల మరో రెండు నెలల గడువు ఇవ్వాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ కార్యాలయం కోరింది. అయితే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై శాసనసభ స్పీకర్ కార్యాలయం ఆచితూచి అడులేస్తుంది. అందుకే మరోసారి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు షెడ్యూల్ విడుదల చేసింది.


