తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు(SSC Advanced Exams) విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 4,96,374 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాయగా.. వారిలో 4,60,519 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అయితే పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈమేరకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ప్రతీరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫెయిలైన విద్యార్థులతో పాటు ఇంప్రూవ్మెంట్ రాయాలనుకునే విద్యార్థులు ఈనెల 16వ తేదీ వరకు ఎగ్జామ్ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
పరీక్షల షెడ్యూల్ ఇదే..
జూన్ 3 : ఫస్ట్ లాంగ్వేజ్
జూన్ 4 : సెకండ్ లాంగ్వేజ్
జూన్ 5 : ఇంగ్లిష్
జూన్ 6 : మ్యాథమెటిక్స్
జూన్ 9 : ఫిజికల్ సైన్స్
జూన్ 10 : బయోలాజికల్ సైన్స్
జూన్ 11 : సోషల్ స్టడీస్
జూన్ 12 : ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజీ పేపర్ -1
జూన్ 13 : ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజీ పేపర్-2