తెలంగాణలో పదో తరగతి (SSC Results) విడుదల ఖరారైంది. బుధవారం ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేతుల మీదుగా ఫలితాలు విడుదల కానున్నాయి. మార్చి 21వ తేదీ నుంచి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి.
- Advertisement -
రాష్ట్రవ్యాప్తంగా 2,650 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా.. 5 లక్షల మంది విద్యార్థులు రాశారు. రిజల్ట్స్ కోసం విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 19 శిబిరాల్లో స్పాట్ వాల్యుయేషన్ జరిగింది. ఈసారి సబ్జెక్టుల వారీగా ఇంటర్నల్ మార్కులు, ఎక్స్‌టర్నల్ మార్కులతో కలిపి SSC పాస్ సర్టిఫికెట్ జారీ చేయనున్నారు.