Friday, April 4, 2025
Homeచిత్ర ప్రభMohan Babu: జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండించిన శివసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు

Mohan Babu: జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండించిన శివసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు

సినీ నటుడు మోహన్‌ బాబు జర్నలిస్టులపై చేసిన దాడిని శివసేన(Shivsena) పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ(Sinkaru Shivaji) తీవ్రంగా ఖండించారు. అయ్యప్ప మాల వేసుకున్న జర్నలిస్టుపై దాడి చేసిన కారణంగా మోహన్‌ బాబు సినిమాలను హిందు సమాజం బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. హిందువుల సత్తా ఏ విధంగా ఉంటుందో త్వరలో చూపిస్తామని హెచ్చరించారు. సినిమాల్లో పెదరాయడులా ఫీల్ అవుతూ మీడియా ప్రతినిధులపై దాడి చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీది అంత పద్దతి గల కుటుంబం అయితే నాలుగు గోడల మధ్య చూసుకోవాల్సిన కుటుంబ కలహాలు బయటకు రాకుండా చూసుకునే సోయి లేదా అని ప్రశ్నించారు.

- Advertisement -

మీ సినిమాలకు ప్రమోషన్ చెయ్యడం కోసం జర్నలిస్టుల సహాయ సహకారం తీసుకున్నప్పుడు ఎక్కడికి పోయింది మీ బుద్ది అని నిలదీశారు. మీ సినిమాల గురించి ఎప్పటికప్పుడు ప్రచారం చేసిన జర్నలిస్టులపైన ఇలాంటి దాడులు చేస్తారా అని మండిపడ్డారు. మోహన్ బాబుకు అహంకారం ఎక్కువైందని.. అందుకే ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ దాడులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. సినిమా హీరోలు ఏమి ఆకాశం నుంచి దిగి రాలేదని తెలిపారు. సినిమా వాళ్లు చెప్పే సొల్లు కబుర్లు చూపించడమే జర్నలిస్టుల విధులని మోహన్ బాబు అనుకుంటున్నారని.. కానీ నిజనిజాలు బయటకి తీసుకురావడమే అసలు సిసలైన జర్నలిజమన్నారు.

సినిమాలో నీతులు చెప్పే మీరు రోడ్డు మీద పడి కొట్టుకుంటుంటే జర్నలిస్టులు ప్రశ్నించకుండా ఏం చేస్తారని ప్రశ్నించారు. సినిమా నటీనటులు సమాజానికి నీతులు చెప్పడం మాత్రమే కాదు బాధ్యతగా నడుచుకోవాలని హితవు పలికారు. ఇలాంటి ఘటనలు మరెక్కడా జరగకుండా ఉండాలంటే మోహన్ ‌బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. సినిమా హీరోలా ఫీల్ అవుతున్న మోహన్ బాబును ఇప్పటికైనా నిజజీవితంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News