Thursday, July 4, 2024
HomeతెలంగాణTelangana tourism Digital platform: డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా తెలంగాణ టూరిజం ప్రమోషన్

Telangana tourism Digital platform: డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా తెలంగాణ టూరిజం ప్రమోషన్

ఫారిన్ టూరిస్ట్స్ ను అట్రాక్ట్ చేసేలా భారీ స్కెచ్

తెలంగాణ రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సింగపూర్ కు చెందిన టూరిజం ప్రమోషనల్ డిజిటల్ మార్కెటింగ్ కు చెందిన ప్రముఖ సంస్థ యూనిక్యూ ప్రతినిధుల బృందంతో ఈమేరకు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. తెలంగాణకు పర్యాటకులను విశేషంగా ఆకర్షించటానికి మలేసియా, సింగపూర్, ఫిలిప్పైన్స్, హాంకాంగ్, థాయిలాండ్ లాంటి దేశాల్లో తెలంగాణ టూరిజం డిజిటల్ ఫెయిర్, ఫిజికల్, రోడ్ షో లు, ట్రావెల్స్ త్రాడెక్స్, ఈవెంట్స్, ఎగ్జిబిషన్స్ టూరిజం ప్రమోషన్ ను నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు

- Advertisement -

మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాదులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోనీ తన కార్యాలయంలో సింగపూర్ కు చెందిన టూరిజం ప్రమోషనల్ డిజిటల్ మార్కెటింగ్ కు చెందిన ప్రముఖ సంస్థ యూనిక్యూ ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రాలకు Asia Pacific దేశాలైనా మలేసియా, సింగపూర్, ఫిలిప్పైన్స్, హాంకాంగ్, థాయిలాండ్ లాంటి దేశాల్లో తెలంగాణ టూరిజం డిజిటల్ ఫెయిర్, ఫిజికల్, రోడ్ షో లు, ట్రావెల్స్ త్రాడెక్స్, ఈవెంట్స్, ఎగ్జిబిషన్స్ టూరిజం ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించటానికి మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ చర్చించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి . శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు. ప్రపంచ స్థాయిలో గుర్తించబడిన టూరిజం ప్రాంతాలు ఉన్నప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకుల నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పర్యాటక రంగాభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, అద్భుతమైన జలపాతాలు, సుందరమైన నదీ ప్రాంతాలు, ECO URBAN PARK లు, అటవీ ప్రాంతాలు, ప్రాచీన కట్టడాలు ,కోటలు, చారిత్రక సంపద, పురావస్తు, వారసత్వ సంపద, ఆధునిక జీవనశైలికి తెలంగాణ రాష్ట్రం గుర్తింపు కు తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి అనేక కార్యక్రమాలను వివిధ దేశాలలో టూరిజం ప్రమోషన్స్ నిర్వహిస్తున్నామన్నారు. సింగపూర్ దేశానికి చెందిన డిజిటల్ మార్కెటింగ్ సంస్థ యూనిక్యూ తెలంగాణ టూరిజం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడానికి రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి డిజిటల్ ప్లాట్పారం ద్వారా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం.

ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం డైరెక్టర్ శ్రీమతి నిఖిల తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, సింగపూర్ దేశానికి చెందిన యూనిక్యూ సంస్థ ప్రతినిధులు కెప్టెన్ K P తాన్, సేభాష్టియన్, లారెన్స్, తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు సత్యనారాయణ , ఓం ప్రకాష్, లతో పాటు సింగపూర్ సంస్థ కు చెందిన కెప్టెన్ ప్రసన్నకుమార్, హర్ష ,అజయ్, మహేష్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News