Today Rain In TG: రాష్ట్రంలో నేడు కూడా నిన్నటి లాగే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర, పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాల్లో మధ్యాహ్నం నుండి రాత్రి వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు అడపాదడపా వర్షాలు పడతాయని అన్నారు. వర్షాలు కురిసే ప్రాంతాల ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో వాతావరణం నిన్నటిలాగే మధ్యాహ్నం వరకు పొడిగా ఉంటుందని.. ఆ తర్వాత ఓ 10 నుంచి 15 నిమిషాల పాటు స్వల్ప వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
గడిచిన 24 గంటల్లో:
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి, గద్వాలలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నల్గొండ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెంమంచిర్యాల, నిజామాబాద్‌లలో తేలికపాటి వర్షాలు కురిసాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో వర్షపు లోటు కొంతవరకు తీరినా.. ఇంకా తీరాల్సిన అవసరం చాలా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అభిప్రాయ పడింది. జూలై 2-3 వారాల్లో రుతుపవనాలకు మళ్ళీ బ్రేక్ పడనుంది అని తెలిపింది. అల్పపీడనం కారణంగా ఇప్పటికీ రాష్ట్రంలోని వర్షపాతం మంచి స్థాయిలోనే ఉందని తెలిపింది. ఇకపోతే తెలంగాణలో జూన్ మొదటి వారంలోనే రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, వాటి ప్రభావం అంతగా లేదు. చాలా జిల్లాలు ప్రస్తుతం మంచి స్థితిలోనే ఉన్నా.. జూలై 2-3 వారాలలో రుతుపవనాలకు మళ్ళీ బ్రేక్ పడుతుండటంతో ఆయా జిల్లాలు మళ్ళీ లోటును ఎదుర్కొంటున్నందున ఈసారి వర్షాకాలం బాగుండకపోవచ్చుననే అభిప్రాయాలు వెల్లడి అవుతున్నాయి.