Sunday, July 7, 2024
HomeతెలంగాణTelangana: పోలీస్ ఈవెంట్స్‌లో మహిళ మోసం.. హైట్ ఎక్కువ పెరిగేందుకు ఏం చేసిందంటే..

Telangana: పోలీస్ ఈవెంట్స్‌లో మహిళ మోసం.. హైట్ ఎక్కువ పెరిగేందుకు ఏం చేసిందంటే..

Telangana: పోలీస్ ఉద్యోగం సాధించాలంటే ఫిజికల్ టెస్టులు, ఈవెంట్స్ పాసవ్వాలి. సరైన హైట్, వెయిట్ వంటి కొలతలకు సరితూగితేనే ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. కొందరికి ఈ అర్హతలు లేకపోతే, ఎలాగోలా మేనేజ్ చేసి ఉద్యోగం సాధించాలనుకుంటారు. కానీ, ఏదో ఒక సమయంలో దొరికిపోతారు. తాజాగా అలాగే దొరికిపోయిందో మహిళ.

- Advertisement -

మహబూబ్ నగర్‌లో జరిగిన ఈవెంట్స్‌లో మోసానికి పాల్పడి దొరికిపోయిందో మహిళ. ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. దీనిలో భాగంగా ఫిజికల్ టెస్టులు, ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్‌లో ఈ టెస్టులు నిర్వహిస్తున్నారు. అయితే, అక్కడ ఒక మహిళ హైట్ విషయంలో మోసానికి పాల్పడింది. హైట్ తక్కువగా ఉన్న ఆమె హైట్ పెరిగేందుకు తల వెంట్రుకల్లో ఎమ్-సీల్ పెట్టుకొంది. అది కాస్త ఎత్తుగా పెట్టుకోవడం వల్ల హైట్ ఎక్కువ వస్తుందని భావించింది. మ్యానువల్‌గా పరీక్ష నిర్వహించి ఉంటే, ఆమె అనుకున్నది జరిగేదే.

కానీ, ఫిజికల్ టెస్టులకు ఎలక్ట్రానిక్ సెన్సర్లు వాడటం వల్ల ఆమె దొరికిపోయింది. ఆమె హైట్ చెక్ చేస్తుండగా, అక్కడి సెన్సర్లు హైట్ గుర్తించలేకపోయాయి. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. ఆమె తలలో ఎమ్-సీల్ పెట్టుకున్నట్లు గుర్తించారు. దీంతో అధికారులు ఆమెను అనర్హురాలిగా ప్రకటించారు. చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూసి చూసి, నిరాశతోనే ఆమె ఈ పని చేసినట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News