Tuesday, December 9, 2025
HomeతెలంగాణViral video: రేవంత్ రెడ్డి, చంద్రబాబు.. నవ్వులే నవ్వులు.. వీడియో వైరల్‌!

Viral video: రేవంత్ రెడ్డి, చంద్రబాబు.. నవ్వులే నవ్వులు.. వీడియో వైరల్‌!

Telugu states Chief Ministers: రామోజీ గ్రూప్‌ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన ‘రామోజీ ఎక్స్‌లెన్స్‌’ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరిగిన ఈ కార్యక్రమానికి భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

- Advertisement -

నవ్వులే.. నవ్వులు: వారిద్దరూ ఆత్మీయంగా ఒకరికొకరు పలకరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వారిద్దరూ పక్కపక్కనే కూర్చొన్నారు. అంతేకాదండోయ్‌ వారు ఆ కార్యక్రమంలో ఉన్నంతసేపు నవ్వుతూనే కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు పలు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News