Friday, September 20, 2024
HomeతెలంగాణTeluguprabha books: జమ్మికుంట జడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్ కు తెలుగుప్రభ పుస్తకాలు

Teluguprabha books: జమ్మికుంట జడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్ కు తెలుగుప్రభ పుస్తకాలు

ఉద్యమనేత సంక్షేమ ప్రదాత, దేశానికి దిక్సూచి కేసీఆర్ పుస్తకాలు అందజేత

తెలుగు ప్రభ దినపత్రిక సంపాదకులు చంద్రశేఖర్ శర్మ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన, అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రజల అందరికీ చేరేలా తెలుగుప్రభ దినపత్రిక ముద్రించిన ..ఉద్యమ నేత సంక్షేమ ప్రదాత-తెలంగాణ సర్కార్ సంక్షేమ పథకాలపై గ్రౌండ్ రిపోర్ట్, దేశానికి దిక్సూచి కెసిఆర్ పుస్తకాలను జమ్మికుంట జడ్పిటిసి సభ్యులు డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ కు తెలుగు ప్రభ దినపత్రిక జమ్మికుంట రిపోర్టర్, (టి. యు డబ్ల్యూ .జె, ఐ,జె యు ) కరీంనగర్ జిల్లా సహాయ కార్యదర్శి కడిపికొండ కొండల్ రెడ్డి, అందజేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా, జెడ్పిటిసి శ్రీరామ్ శ్యామ్ మాట్లాడుతూ, పత్రికలు కనుమరుగవుతున్న తరుణంలో, తెలుగుప్రభ దినపత్రిక యాజమాన్యం, కష్ట నష్టాలను అధిగమించి, శ్రమకు ఓర్చి, రాష్ట్ర నలుమూలల ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే విధంగా పుస్తకాలను ముద్రించినందుకు పత్రిక యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోటి పాత్రికేయులు, సమ్మెట సదానందం, గంగారపు రఘుబాబు, కొండా విజయ్, గజ్జల క్రాంతి, శ్రీనివాస్ పటేల్, రవికుమార్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News