బషీరాబాద్ మండలం జీవన్గి, క్యాద్గిరా గ్రామ శివారులో ప్రభుత్వ భూములలో అక్రమ నాపరాయి తవ్వకాలు జరుగుతున్నాయని ‘తెలుగు ప్రభ’ పత్రికలో వచ్చిన కథనానికి స్పందించి శనివారం రోజు మైనింగ్, రెవెన్యూ అధికారులు నపరాతి తవ్వకాల గనులపై దాడులు నిర్వహించి, అక్కడ ఉన్న కటింగ్ మిషన్ల, బ్లేడ్స్, మోటార్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఐ రాకేష్ మాట్లాడుతూ నాలుగు బ్లేడ్లు, మూడు, మోటార్స్ స్వాధీనం చేసుకొని మైనింగ్ అధికారులకు అప్పగించామన్నారు. మళ్లీ ఇటువంటి అక్రమ తవ్వకాలకు పాల్పడితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మైనింగ్ అధికారులు టెక్నికల్ అసిస్టెంట్, నాగలక్ష్మి, ఆర్ఐ రాకేష్ , సర్వర్లు, ప్రభువు, లక్ష్మీనారాయణ, వీఆర్ఏలు శ్రీశైలం, హైమద్, గోవిందు, హనుమంతు, గోపాల్, భరత్, యాకాంబరి, నరేష్, శామప్ప పాల్గొన్నారు.