మేడారం మహా జాతర సందర్భంగా జాతర ప్రాచుర్యం సమాజానికి తెలియజేయడం గొప్ప విషయం అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రిపొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి,స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ ( సీతక్క) అన్నారు. సోమవారం మేడారంలోని మీడియా సెంటర్లో సమాచార శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ ఇలా త్రిపాఠి, సమాచార శాఖ ఆర్జెడి డి ఎస్ జగన్ తో కలిసి తెలుగు ప్రభ దినపత్రిక ముద్రించిన ప్రత్యేక సంచికను వారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక సంచికలో జాతర విశేషాలతో పాటు జాతరలో విధులు నిర్వహించే అధికారులు, ములుగు జిల్లా అధికారుల సెల్ నెంబర్లు పొందుపరచడం చెప్పుకోదగ్గ విషయమన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఈ ప్రత్యేక సంచిక ఎంతగానో ఉపయోగపడుతుందని, రానున్న జాతరలో ఇదే తరహాలో ప్రత్యేక సంచికలు వెలువరించాలని కోరారు.
కార్యక్రమంలో సమాచార శాఖ ఏడి లక్ష్మణ్, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారులు పల్లవి, అయూబ్ ఖాన్, కిరణ్ మై, ఎం ఏ గౌస్, రాజేంద్రప్రసాద్, ఎండి రఫీక్, ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో టి. శ్రీనివాస్ , ములుగు జిల్లా ఇన్చార్జి బ్యూరో చీఫ్ జి. శ్రీధర్, జిల్లాలోని తెలుగు ప్రభ పాత్రికేయులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.