Sunday, November 16, 2025
HomeతెలంగాణTelangana Weather: తెలంగాణలో చలి పంజా.. పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు

Telangana Weather: తెలంగాణలో చలి పంజా.. పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు

తెలంగాణలో చలి(Winter) పంజా విసురుతోంది. చలిగాలులతో ప్రజలు అల్లాడుతున్నారు. కనిష్ట ఉష్టోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. ఇక హైదరాబాద్‌(Hyderabad)లో అయితే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొద్ది రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతుందని తెలిపారు.

- Advertisement -

హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో నగరవాసులు చలితో గజగజ వణికపోతున్నారు. నగరంలోని మౌలాలి, హెచ్‌సీయూ ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు 7.1 డిగ్రీలు, బీహెచ్‌ఈఎల్(BHEL) 7.4, రాజేంద్రనగర్ 8.2 , గచ్చిబౌలి 9.3, వెస్ట్ మారేడ్‌పల్లి 9.9, కుత్బుల్లాపూర్ 10.2, మచ్చబొల్లారం 10.2, శివరాంపల్లి 10.3, బాలానగర్ 1.1.4.5, షాపూర్ నగర్ 11.7, లింగంపల్లి 11.8, బోయిన్‌పల్లి 11.9, బేగంపేట్ 12, ఆసిఫ్‌నగర్ 12, నేరేడ్‌మెట్ 12.1, లంగర్ హౌస్ 12.2, మోండా మార్కెట్ 12.4, చందానగర్ 12.7, షేక్‌పేట, 2.82, మాదాపూర్, 2.81, మాదాపూర్, 12. చాంద్రాయణగుట్ట 13, కూకట్ పల్లి 13.1, గోల్కొండ 13.2, సఫిల్ గూడ 13.3, హయత్ నగర్ 13.3, ఉప్పల్ 13.4, మల్లాపూర్ 13.5, ఆదర్శనగర్ 13.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఇక ఆదిలాబాద్ జిల్లా బేలలో కనిష్ట ఉష్ణోగ్రత 6.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజులు చలిగాలులు తీవ్రంగా వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad