చలికాలం పూర్తికాక ముందే ఎండలు మొదలయ్యాయి. గత రెండు, మూడు రోజుల నుంచి సూర్యుడు(Summer Effect) విజృంభిస్తున్నాడు. దీంతో తెలంగాణ(Telangana)లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. వాతావరణంలో తేమ శాతం తగ్గడంతో ఉష్ణోగ్రతలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం 32 నుంచి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు.
- Advertisement -
సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు పెరిగాయని చెప్పారు. హైదరాబాద్, నిజామాబాద్, హనుమకొండ, మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయని వెల్లడించారు. మరోవైపు ఏపీలోనూ ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలిత్తిపోతున్నారు. సమ్మర్ మొదలు కాకుండానే ఎండలు దంచికొడుతున్నాయని.. ఇక ఎండకాలం మొదలైతే ఎలా ఉంటుందో అని దడుసుకుంటున్నారు.