Saturday, November 15, 2025
HomeతెలంగాణTeacher Promotions : ఉపాధ్యాయుల పదోన్నతులకు బ్రేక్‌!

Teacher Promotions : ఉపాధ్యాయుల పదోన్నతులకు బ్రేక్‌!

Teacher Promotions in Telangana: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియకు ఊహించని అడ్డంకి ఎదురైంది. హైకోర్టులో కొందరు ఉపాధ్యాయులు దాఖలు చేసిన పిటిషన్‌ల నేపథ్యంలో ఈ నెల 11వ తేదీ వరకు పదోన్నతుల ప్రక్రియను నిలిపివేస్తూ ఉన్నత న్యాయస్థానం స్టే ఆదేశాలు జారీ చేసినట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. విద్యాశాఖ సమాచారం ప్రకారం, ఈ నెల 4వ తేదీన ప్రారంభమైన ఈ ప్రక్రియ 11వ తేదీ నాటికి పూర్తి కావాల్సి ఉంది. సుమారు 3,800 మందికి పైగా ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్‌లు, గెజిటెడ్ హెడ్‌మాస్టర్‌లుగా పదోన్నతి పొందాల్సి ఉంది. అయితే, సీనియారిటీ నిర్ణయంపై వివాదం తలెత్తడంతో ఈ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana-news/congress-bc-reservations-dharna-delhi/

ఇదీ వివాదం..
2002 ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ ద్వారా కొందరు ఉపాధ్యాయులు.. అదే ఏడాది అక్టోబర్ 17న స్కూల్ అసిస్టెంట్‌లుగా విధుల్లో చేరారు. అదే సంవత్సరం నవంబర్ 1న సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) నుంచి స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి పొందినవారు కూడా ఉన్నారు. నిబంధనల ప్రకారం, విధుల్లో చేరిన తేదీ ఆధారంగా సీనియారిటీ నిర్ణయించబడుతుంది. దీని ప్రకారం, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా నియమితులైనవారు సీనియారిటీ జాబితాలో ముందు ఉంటారు. ఈ విషయంపై స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: https://teluguprabha.net/telangana-news/cm-revanth-said-hyderabad-is-the-capital-for-the-life-sciences-companies/

తమ పదోన్నతుల షెడ్యూలు.. 2002 డీఎస్సీ నోటిఫికేషన్‌కు ముందే జారీ అయిందని, దానికి తోడు పలుమార్లు వాయిదా పడిందని, కాబట్టి తామే సీనియర్లమని పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు వాదిస్తున్నారు. ఈ అంశంపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ నెల 11వ తేదీ వరకు పదోన్నతుల ప్రక్రియపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. మరోవైపు, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో ఉత్తీర్ణత సాధించని వారికి పదోన్నతులు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని, పాఠశాల విద్యాశాఖ దాన్ని అమలు చేయడం లేదని మరికొందరు ఉపాధ్యాయులు పిటిషన్ దాఖలు చేశారు. అందుకే ఈ వివాదాలు పరిష్కారమయ్యే వరకు పదోన్నతుల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad