Thursday, July 10, 2025
HomeతెలంగాణGurukula job opportunities: ఒకేషనల్ గురుకులాల్లో ఉద్యోగ అవకాశాలు.. నెలకు రూ.48 వేల జీతంతో..!

Gurukula job opportunities: ఒకేషనల్ గురుకులాల్లో ఉద్యోగ అవకాశాలు.. నెలకు రూ.48 వేల జీతంతో..!

Jobs in gurukula: తెలంగాణలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, తమ ఒకేషనల్ కళాశాలల్లో తాత్కాలిక బోధన కోసం అర్హత, అనుభవం కలిగిన నిపుణులైన బోధకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ అర్హత పత్రాలతో ఇంటర్వ్యూ, డెమోకు హాజరు కావాలని సూచించారు.

- Advertisement -

ఖాళీల వివరాలు:

వివిధ ఒకేషనల్ కోర్సులలో ఖాళీలు కింది విధంగా ఉన్నాయి:

* కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ (CGA): హత్నూర జూనియర్ కాలేజ్ (బాలురు), శంకర్‌పల్లి (బాలురు) కళాశాలల్లో 2 పోస్టులు.
* కంప్యూటర్ సైన్స్ (CS): హత్నూర జూనియర్ కాలేజ్ (బాలురు), శంకర్‌పల్లి (బాలురు), మణికొండ (బాలికలు), వర్ధన్నపేట (బాలురు) కళాశాలల్లో 4 పోస్టులు.
* ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ టెక్నీషియన్ (ECT): హత్నూర జూనియర్ కాలేజ్ (బాలురు), శంకర్‌పల్లి (బాలురు) కళాశాలల్లో 2 పోస్టులు.
* ఎలక్ట్రికల్ టెక్నీషియన్ (ET): కొండాపూర్ (బాలురు), న్యాల్కల్ (బాలురు) కళాశాలల్లో 2 పోస్టులు.
* టూరిజం హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (T & HM): బంట్వరం (బాలికలు), జగద్గిరి గుట్ట (బాలికలు), హుస్నాబాద్ (బాలురు) కళాశాలల్లో 3 పోస్టులు.
* ఆఫీస్ అసిస్టెంట్‌షిప్ (OA): వికారాబాద్ ఆర్‌డీసీ (బాలికలు), జగద్గిరిగుట్ట ఆర్‌డీసీ (బాలికలు) కళాశాలల్లో 2 పోస్టులు.
* అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ (A & T): చింతకుంట (బాలికలు), శంషాబాద్ (బాలురు), ఆలేరు (బాలికలు), మణుగూరు (బాలురు) కళాశాలల్లో 4 పోస్టులు.
* కమర్షియల్ గవర్నమెంట్ టెక్నాలజీ: బద్దెనపల్లి (బాలికలు)లో 1 పోస్టు.
* ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్ (I & M): చింతకుంట (బాలికలు), శంషాబాద్ (బాలురు) కళాశాలల్లో 2 పోస్టులు.
* ఫార్మా టెక్నాలజీ (PT): మహబూబాబాద్ ఆర్‌డీసీలో 1 పోస్టు.
ముఖ్యమైన తేదీలు, వేదిక:
* ఇంటర్వ్యూ, డెమో తేదీ: ఈ నెల 8న (జూలై 8, 2025)

* సమయం: ఉదయం 9 గంటలకు

* వేదిక: రంగారెడ్డి జిల్లా, సరూర్ నగర్, సాంఘిక సంక్షేమ గురుకులం (బాలికలు)

వేతనం, ఇతర నిబంధనలు:

ఎంపికైన బోధకులకు గంటకు గరిష్టంగా రూ. 400 వరకు గౌరవ వేతనం చెల్లిస్తారు. అనుభవాన్ని బట్టి నెలవారీ చెల్లింపు గరిష్టంగా రూ. 48,000 వరకు ఉంటుంది. ఎంపికైన బోధకులు రెసిడెన్షియల్ కళాశాలల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

మరిన్ని వివరాలకు:

అర్హత వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://tgswreis.telangana.gov.in ను సందర్శించవచ్చు. ఏమైనా సందేహాలుంటే హెల్ప్‌లైన్ నంబర్ 040-23391598 ను సంప్రదించగలరు.
ఈ అవకాశం ఒకేషనల్ బోధనలో ఆసక్తి ఉన్న నిపుణులకు చక్కటి అవకాశం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News