Wednesday, January 8, 2025
HomeతెలంగాణBJP vs Congress: గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత.. పోలీసులు లాఠీఛార్జ్

BJP vs Congress: గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత.. పోలీసులు లాఠీఛార్జ్

హైదరాబాద్‌లోని గాంధీభవన్(Gandhi Bhavan) ముట్టడికి బీజేపీ నేతలు యత్నించారు. అక్కడ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేతల ప్లెక్సీలను మంగళవారం చించివేశారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం బారికేడ్లు తోసుకుంటూ గాంధీ భవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

- Advertisement -

కాగా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై దాడి చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ గాంధీభవన్ ముట్టడికి దాగారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై భైఠాయించి నినాదాలు చేస్తున్నారు. పరిస్థితి చేయిదాటి పోవడంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News