Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభManchu Family: మోహన్ బాబు ఇంటి వద్ద మళ్లీ టెన్షన్.. టెన్షన్

Manchu Family: మోహన్ బాబు ఇంటి వద్ద మళ్లీ టెన్షన్.. టెన్షన్

Manchu Family| మంచు కుటుంబం వివాదం ఇప్పుడలా సద్దుమణిగేలా కనపడటం లేదు. వేర్వేరుగా ప్రెస్ మీట్లు నిర్వహించిన మంచు విష్ణు(Manchu Vishnu), మంచు మనోజ్(Manchu Manoj) శంషాబాద్ జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్దకు చేరుకున్నారు. తమ నివాసంలో ఉన్న ప్రైవేట్ వ్యక్తులు బయటకు వెళ్లిపోవాలని మనోజ్ వార్నింగ్ ఇచ్చారు. వెంటనే విష్ణు జోక్యం చేసుకొని ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఎవ్వరూ లేరని బదులు ఇచ్చారు. అలాగే మనోజ్‌కి సంబంధించిన ప్రైవేట్ వ్యక్తులు కూడా బయటికి వెళ్లాలని హెచ్చరించారు. దీంతో మళ్లీ అక్కడ ఏం జరుగుతుందోననే టెన్షన్ వాతారణం నెలకొంది.

- Advertisement -

ఇదిలా ఉంటే మనోజ్ ఇల్లు ఖాళీ చేయకపోతే తాను రంగంలోకి దిగుతానని విష్ణు తెలిపారు. మరోవైపు మనోజ్‌పై దాడి కేసులో విష్ణు ప్రధాన అనుచరుడు కిరణ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక మరో నిందితుడు వినయ్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. ఇక కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోహన్ బాబు(Mohanbabu)ను మనోజ్ పరామర్శించనున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad