TG Assembly| తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల(Assembly sessions)కు ముహూర్తం ఖరారు అయింది. శీతాకాల సమావేశాలు డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 7వ తేదీకి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి కానుంది. దీంతో ఈ ఏడాదిలో ప్రభుత్వం చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి సభలో చర్చించనున్నారు. అలాగే భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టనున్న సంక్షేమ పథకాల గురించి కూడా చర్చకు సిద్ధం అవుతోంది.
పంచాయతీ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో ఇద్దరూ కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా పోటీ చేసేందుకు అర్హులుగా చట్టం తీసుకురానున్నారు.వీటితో పాటు కొత్త ఆర్ఆర్ఆర్ చట్టం, కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్, పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు, పలు కొత్త చట్టాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు ఎన్నికల హామీలు, ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు కూడా సిద్దం కానున్నాయి.