తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ(TG Cabinet) విస్తరణకు ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం ఖాళీగా ఉన్న ఆరు స్థానాల్లో ప్రస్తుతానికి నాలుగైదు స్థానాలు భర్తీ చేసే అవకాశం ఉంది. ఇందులో రెడ్డి, బీసీ, ఎస్సీలకు అవకాశం కల్పించనున్నారు. రెడ్డి సామాజికవర్గం నుంచి సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డిలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. ఇక బీసీల నుంచి శ్రీహరి ముదిరాజ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. ఎస్సీ సామాజికివర్గం నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి.. మైనారిటీలకు అవకాశమిస్తే ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్‌కు అవకాశం దక్కనుందని ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే ఛాన్స్ ఉంది. ఈ మేరకు రాష్ట్ర కోర్ కమిటీ నుంచి ఏఐసీసీ వివరాలు తీసుకుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ నుంచి అభిప్రాయాలు సేకరించింది.