ఈనెల 30వ తేదీ జరగాల్సిన తెలంగాణ కేబినెట్(TG Cabinet) భేటీని వాయిదా వేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) సంతాప దినాల్లో భాగంగా ఆయనకు నివాళులర్పించేందుకు సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో ఆరోజు జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేసింది. తిరిగి కేబినెట్ భేటీ ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.
- Advertisement -
కాగా రైతు భరోసా, రేషన్ కార్డుల విధివిధానాలు, భూమి లేని నిరుపేదలకు నగదు బదిలీ, కుల గణన, స్థానిక సంస్థల ఎన్నికలు వంటి కీలక అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం వాయిదా పడటంతో తర్వాత జరిగే భేటీలో వీటిపై చర్చించనున్నారు.