తెలంగాణ ఎప్‌సెట్(TG EAPCET) ఫలితాల విడుదల తేదీని అధికారులు ప్రకటించారు. మే 11న ఆదివారం ఉదయం 11 గంటలకు ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల జాబితాను వెల్లడించనున్నారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో అడ్మిషన్లకు ఈఏపీసెట్ ఎంట్రన్స్ ర్యాంకుల ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఇటీవల ప్రాథమిక కీ కూడా రిలీజ్ చేశారు.
ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు ఎప్‌సెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్ష, మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష పరీక్షలు నిర్వహించారు. ఇంజనీరింగ్‌కు 2,20,327 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,07,190 మంది పరీక్షకు హాజరయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 86,762 మంది దరఖాస్తు చేసుకోగా.. 81,198 మంది హాజరయ్యారు.