ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)కు స్వల్ప ఊరట దక్కింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో(Telangana highcourt) విచారణ జరిగింది. కేటీఆర్‌కు బెయిల్ మంజూరు చేసినా, నాట్ టు అరెస్ట్ ఇచ్చినా విచారణకు ఇబ్బందికర వాతావరణం ఉంటుందని ఏసీబీ(ACB) కౌంటర్ దాఖలు చేసింది. అలాగే నాట్ టు అరెస్ట్‌ను ఎత్తివేయాలని మరో పిటిషన్ వేసింది. ఇందులో ప్రతివాదిగా కేటీఆర్‌ను చేర్చింది.
దీంతో కేటీఆర్ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31కు తదుపరి విచారణ వాయిదా వేసింది. అప్పటివరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దనే ఆదేశాలను పొడిగించింది. కాగా ఈ కేసులో కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించడంతో ఈనెల 30వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
కాగా ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అర్వింద్‌కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని చేర్చింది. కేటీఆర్‌పై విచారణకు ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో.. దీనిపై విచారణ చేయాలని సీఎస్ శాంతి కుమారి ఏసీబీకి లేఖ రాశారు. దీంతో కేసు నమోదుచేసిన ఏసీబీ దర్యాప్తును ముమ్మరం చేసింది.