TG HighCourt| తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై న్యాయస్థానంలో జరిగే లైవ్ ప్రొసీడింగ్స్ రికార్డ్ చేయరాదని హైకోర్టు రిజిస్ట్రార్ ఓ ప్రకటన విడుదల చేశారు. న్యాయస్థానాల్లో జరిగే లైమ్ స్ట్రీమ్స్‌ను టెలికాస్ట్ చేయండపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయస్థానాల్లో జరిగే లైమ్ స్ట్రీమ్‌లు మీడియాలో, సోషల్ మీడియాలో ప్రసారం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
కోర్టు ప్రొసీడింగ్స్ లైవ్‌ను వీడియో తీసి వాటిని టీవీలు, సోషల్ మీడియాలో ప్రసారం చేయడం చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు. ప్రసారం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికే ప్రసారం చేసిన వాటిని తొలగించాలని ఆదేశించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆదేశాల మేరకు ఈ ప్రకటన విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. కాగా ఇటీవల కోర్టు లైవ్ స్ట్రీమింగ్ వీడియోలు పలు మీడియా ఛానళ్లతో పాటు సోషల్ మీడియాలోనూ ప్రసారమయ్యాయి. దీంతో వీటిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.