ఇటీవల ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా తెలంగాణ హైకోర్టు(TG Highcourt)లో సీనియర్ న్యాయవాది వేణుగోపాల్‌కు గుండెపోటుకు గురయ్యారు. న్యాయస్థానంలో కేసు వాదిస్తున్న సమయంలోనే ఆయన కుప్పకూలిపోయారు. దీంతో హుటాహుటిన తోటి లాయర్లు, కోర్టు సిబ్బంది ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. న్యాయవాది మృతికి సంతాపంగా హైకోర్టులో అన్ని బెంచ్‌లలో విచారణలు నిలిపివేశారు.