Thursday, January 2, 2025
HomeతెలంగాణSajjanar: డిజిటల్ అరెస్టులపై ఐపీఎస్ సజ్జనార్ సూచనలు

Sajjanar: డిజిటల్ అరెస్టులపై ఐపీఎస్ సజ్జనార్ సూచనలు

ఇటీవల కాలంలో పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్(Digital Arrest) కేసులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ వీసీ సజ్జనార్(Sajjanar) ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇటాంటి ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు.

- Advertisement -

‘నేరం ఏదైనా సరే ‘డిజిటల్ అరెస్ట్’ అనేదే ఉండదు. దర్యాప్తు అధికారులు నేరుగా వచ్చి నేరస్తులను అరెస్ట్ చేస్తారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరైనా బెదిరిస్తే అది మోసం అని గుర్తించండి. సైబర్ మోసాల్లో చిక్కుకోవడానికి కారణం అవగాహనా లోపమే. మన దేశంలోని ఏ దర్యాప్తు సంస్థ కూడా ప్రజల వ్యక్తిగత వివరాలను ఫోన్ ద్వారా అడగదు. లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు ఫోన్ లేదా ఆన్ లైన్ ద్వారా బెదిరింపులకు పాల్పడవు. ఎవరైనా బెదిరిస్తే వారు నకిలీలని అర్థం. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఫోన్ కాల్ వస్తే భయపడకుండా మీ సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కు కాల్ చేసి సమాచారం అందించండి’’ అంటూ ప్రజలకు సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News