Saturday, November 15, 2025
HomeతెలంగాణTGRTC: పండుగ సీజన్.. పురుషులపై అదనపు భారం..!

TGRTC: పండుగ సీజన్.. పురుషులపై అదనపు భారం..!

Telangana: రాఖీ పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక బస్సులను నడుపుతుంది. హైదరాబాద్ నుండి పలు గ్రామాలకి వెళ్లే ప్రయాణికుల సంఖ్య పండుగ సమయాలలో అధికంగా ఉంటుంది. ప్రయాణికుల సౌలభ్యం కోసం టీజీఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక బస్సులలో టికెట్ ధర మాములు బస్సులలో ఉన్న ధర కంటే 30 శాతం ఎక్కువగా ఉంది. ఈ ధరలను చూసి ప్రయాణికులు వాపోతున్నారు.

- Advertisement -

మరోవైపు పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, ఎలక్ట్రికల్ బస్సులలో మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సర్వీస్ అందిస్తుంది. ఇది సామాజిక దృష్టికోణంలో ఇది అభినందనీయమైనదే.. కానీ ఇదే సమయంలో ప్రత్యేక బస్సులలో 30 శాతం ఎక్కువ వసూలు చేయటం అనేది బాధించదగిన విషయమే..!

Read more: https://teluguprabha.net/telangana-news/mahabubnagar-dry-port-gudibanda-proposal/

హైదరాబాద్ నుండి తొర్రూర్ వెళ్ళడానికి ఇద్దరు వ్యక్తులు ఉప్పల్ క్రాస్ రోడ్ లో ఆర్టీసీ బస్సు ఎక్కారు. రూ.220 కి ఇవ్వాల్సిన టికెట్, ఇద్దరికీ కలిపి రూ.660 తీసుకున్నారు. సాధారణ బస్సులో రూ.220, ప్రత్యేక బస్సులో రూ.330 ఒక్కో టికెట్ కి ఛార్జ్ చేస్తున్నారు. దీనిపై ఆర్టీసీ స్పందిస్తూ పండుగ వేళలో టికెట్ ధరలు పెంచడానికి అనుమతి ఉందని తెలుపుతుంది. దీనిపై సదరు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more: https://teluguprabha.net/telangana-news/the-weather-has-cooled-down-across-the-state-the-sky-has-been-cloudy-in-hyderabad-since-morning-there-is-a-possibility-of-heavy-rain-in-some-areas/

పండగ వేళలో అన్ని ప్రాంతాలలో రద్దీగా ఉంటుంది. ఇటువంటి సమయంలో, భద్రత, సౌకర్యంతో పాటు, ఆర్థిక న్యాయం కూడా ప్రతి ప్రయాణికుడికి లభించాలి. ప్రభుత్వం, ఆర్టీసీ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని సంతులితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad