TGSRTC Drivers, Shramiks Recruitment: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారీ నోటిఫికేషన్ రానే వచ్చింది. తెలంగాణ ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 1743 డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 8 నుంచి 28వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. పూర్తి వివరాల కోసం www.tgprb.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది.
పోస్టుల వారీగా అర్హతలు ఇవే..
డ్రైవర్స్ విషయానికి వస్తే.. ఈ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు పదో తరగతి లేదా సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ పోస్టుకు పురుషులతో పాటు మహిళలు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 2025 జూలై 1 నాటికి 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయోసడలింపు ఉంటుంది. ఇక, శ్రామిక్ పోస్టు విషయానికి వస్తే.. ఈ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సంబంధిత ట్రేడ్ విభాగం అనగా మెకానిక్ (డీజిల్ / మోటార్ వెహికల్) లేదా షీట్ మెటల్ / MVBB లేదా ఫిట్టర్ లేదా ఆటో ఎలక్ట్రీషియన్ / ఎలక్ట్రీషియన్ లేదా పెయింటర్ లేదా వెల్డర్ లేదా కటింగ్ ,కుట్టుపని/ మిల్‌రైట్ మెకానిక్ లేదా ఎక్సలెన్స్ తత్సమాన పరీక్షలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. కాగా, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఇక శ్రామిక్ పోస్టులకైతే నిర్దిష్ట విద్యార్హతలు ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. మరిన్ని సమాచారాన్ని తెలుసుకోవడానికి టీజీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా సందర్శించి, ఎప్పటికప్పుడు తనిఖీ చెక్ చేసుకోవాలని నియామక బోర్డు సూచించింది.
Also Read: https://teluguprabha.net/telangana-news/ktr-comments-on-cm-revanth/
సెలెక్షన్ ప్రాసెస్ ఇదే..
డ్రైవర్ పోస్టుకు ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, వెయిటేజీ మార్కులు, కనీస అర్హత మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక, శ్రామిక్ పోస్టుల విషయానికి వస్తే.. వెయిటేజీ మార్కులు, కనీస అర్హత మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసే జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ. 600 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు, శ్రామిక్స్ పోస్టులకు దరఖాస్తు చేసే జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 400 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 200 చెల్లించాలి.


