తెలంగాణ ఆర్టీసీలో(TGSRTC) సమ్మె సైరన్ మోగనుంది. మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఈమేరకు సంస్థ ఎండీ సజ్జనార్, లేబర్ కమిషనర్‌కు జేఏసీ నేతలు సమ్మె నోటీసులు అందజేశారు. మే 7వ తేదీ మార్నింగ్ డ్యూటీ నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ నెల మొదలై వారం రోజులు అయినా ఇంతవరకు ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పడలేదని తెలిపారు. కాగా జనవరి 27న తమ డిమాండ్లు పరిష్కరించాలని, లేదంటే సమ్మెకు దిగుతామని సంస్థకు నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చినా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సమ్మె నిర్వహించేందుకు కార్మికులు సిద్ధమయ్యారు.